బ్యాంకు గ్యారంటీ చెల్లించిన మిల్లులకు ధాన్యం కొనుగోలు ప్రక్రియను అనుసంధానం చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో 2024-25 సంవత్సరంలో ధాన్యం సేకరణపై జాయింట్ కలెక్టర్ చిన్న రాముడుతో కలసి సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను అందిస్తామన్నారు.