కోరుకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 11 మద్యం దుకాణాలకు 399 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస బాలాజీ శుక్రవారం తెలిపారు. మద్యం దుకాణాల ద్వారా రూ. 7. 98 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాల పరిధిలో షాపులకు దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. ఈ నెల 14వ తేదీన రాజమహేంద్రవరంలో డ్రా తీసి విజేతలకు షాపులు కేటాయిస్తారన్నారు.