గ్రామాల్లో అపరిష్కృతంగా నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు మన గ్రామం మన సుభాష్ కార్యక్రమ ఉద్దేశమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని కాజులూరు, తిప్పరాజు పాలెం గ్రామాల్లో సోమవారం జరిగిన మన గ్రామం మన సుభాష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక నేతలు సమన్వయంతో గ్రామాన్ని అభివృద్ధి పర్చుకోవాలన్నారు.