స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ( ఎంఎస్ఎంఈ )ద్వారా పరిశ్రమల స్థాపన కోసం కోటిపల్లి రేవు సమీపంలో 350 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ వెల్లడించారు. రామచంద్ర పురం లోని విఎస్ఎం కళాశాల ప్రాంగణంలో ఆదివారం జరిగిన అవగాహన సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు.