అల్లూరి జిల్లా అడ్డతీగల గ్రామం లో గల హైస్కూల్ ప్రాంగణం లో 10 వ తరగతి 2012వ సంవత్సర బ్యాచ్ యొక్క పూర్వ విద్యార్థులు సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా వారికి 10 వ తరగతి లో విద్య ను అందించిన వారి గురువులకు ఘనంగా సన్మానం చేశారు. విద్యార్థులందరూ తమ చిన్న నాటి సంగతులను నేమరువేసుకుని ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమాల అనంతరం విందు, వినోదాలతో ముగిసింది.