మారేడుమిల్లి సమీపంలో ఆదివారం అడవి దున్నల గుంపు సంచారం స్థానికులను కలవరపరిచింది. భారీగా వాగులు పొంగి ప్రవహించడంతో మారుమూల అటవీ ప్రాంతానికి వెళ్లే పరిస్థితి లేక చింతూరు రోడ్డుపైకి వచ్చేశాయి. ఒకేసారి పదుల సంఖ్యలో దున్నలు పరుగులు పెట్టడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యా రు. కర్రలతో బెదిరించడంతో అవి సమీపంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి.