ప్రస్తుతం రాష్ట్రం మొత్తం చంద్రబాబు అరెస్ట్ చుట్టూ తిరుగుతుందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లా అడ్డతీగల గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు జరగకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. అడ్డతీగల ఎస్సై అప్పలరాజు పోలీసుల బృందం అడ్డతీగలలోని కూడలి అయిన సీతపల్లి సెంటర్ వద్ద సుమారు 15 మంది పోలీసులు టిడిపి పార్టీ వాళ్లు ఎలాంటి ఆందోళనలు జరపకుండా నివారించడానికి సిద్దంగా ఉన్నారు.