అల్లూరి జిల్లా అడ్డతీగలలోని ప్రముఖ క్షేత్రమైన శ్రీ పవనగిరి క్షేత్రంలో శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర గుడి నూతన విగ్రహ ప్రతిష్ట బుధవారం ఘనంగా చేయడమైనది. ఆలయ నిర్మాణం రాజమండ్రికి చెందిన శ్రీ రామ చంద్ర శేఖర శాస్త్రి(లేటు), వీరి సతీమణి కమల కుమారి గారి కుటుంబీకుల చే నిర్మింపగా కమాలకుమారి తమ్ముడు రామకృష్ణ రావు, వీరి సతీమణి శ్రీదేవి (హైదరాబాద్ )వారు ప్రతిష్ఠా మహోత్సవ కర్తలుగా ఉండి నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా శ్రీ శివ నాడి జ్యోతిష్యులు శ్రీ జనార్ధన స్వామి (రాజమండ్రి ) దంపతులు విచ్చేయగా టిటిడి రాజమండ్రి హిందూ ధర్మ పరిషత్ ఇన్చార్జి ఓరుగంటి నరసింహ యోగి, అడపా పెదకాపు దంపతులు, వెలమాలకోట నుండి సత్యనారాయణ దంపతులు, చింతూరు నుండి సమాక్క సారక్క దేవేరులు, పూజారులు, అచ్చియపేట భక్తులు, కాకినాడ భక్తులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి పూజతో ప్రారంభమయిన ప్రతిష్టాపన తొలి పూజ జరిగిన అనంతరం ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఆంజనేయస్వామి వారికి సింధూర నాగవలి దళాలతో, తమలపాకులతో, నిమ్మకాయల దండలు, పవన హోమంతో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర హోమం పూర్ణాహుతితో ముగిసినది. చివరగా తీర్థ ప్రసాదములు, అన్నదానం జరిగినది.