అల్లూరి సీతరామరాజు జిల్లా అడ్డతీగల గ్రామం లో గల సెయింట్ మేరిస్ పాఠశాలలో 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. 75 వ అమృత వారోత్సవాలు సందర్భంగా పిల్లలు అందరూ కలిసి త్రివర్ణ పతాక చిత్రపటం ను పాఠశాల స్థలం లో పెయింటింగ్ వేసి 75 సంఖ్య ఆకారం లో కూర్చున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అడ్డతీగల డిప్యూటీ తహశీల్దార్ శ్రీమతి తేజస్విని భాస్కర్ పిల్లలకు తమ జీవిత ధ్యేయం లో దేశాన్ని అభివృద్ధి పరచే ఆలోచనలు కూడా ఉండాలని చక్కటి సందేశం అందించారు. అనంతరం దేశ భక్తి గేయాలు, పాటలు, నృత్యాలు విద్యార్ధుల చే అలరించాయి. ఈ కార్యక్రమం లో అతిథులు , తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.