రంపచోడవరంను ప్రత్యేక జిల్లా కోరుతూ అధికారులకు విద్యార్థులు లేఖలు

959చూసినవారు
రంపచోడవరంను ప్రత్యేక జిల్లా కోరుతూ అధికారులకు విద్యార్థులు లేఖలు
ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాల్లో రంపచోడవరం నియోజకవర్గాన్ని పాడేరు కేంద్రంగా ఏర్పాడబోయే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలుపబోతున్నట్లు ప్రకటించడంతో, అడ్డతీగలలోని సెయింట్ మేరిస్ పాఠశాల విద్యార్థులు తమ ప్రాంతాన్ని పాడేరు జిల్లాలో కలుపడం ద్వారా తమకు కలిగే సమస్యలను వివరిస్తూ ప్రభుత్వ పాలకులకు సోమవారం లేఖలు పంపారు. తమ ప్రాంతం నుండి పాడేరు సుమారు 250 కి. మీ దూరం మరియు మూడు ఘాట్ రోడ్లు కలిగి మూడు రోజుల ప్రయాణ వ్యయం, శారీరక ప్రయాసలతో ఇప్పటికే వెనుకబడిన తమ గిరిజన ప్రాంతం సమాచార లోపంతో ఇంకా వెనుకబడుతుందని తమ ఆవేదనను విద్యార్థులు ఆ లేఖల్లో పొందు పర్చారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా లేదా రాజమహేంద్రవరం జిల్లాలో కలుపవలసిందిగా కోరుతూ, ఆ లేఖలను రాష్ట్ర ముఖ్యమంత్రి, కలెక్టర్, సబ్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పంపారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్