తూర్పు జనసేన ప్రోగ్రాం కమిటీ సభ్యుడిగా "రాజేంద్ర"

1200చూసినవారు
తూర్పు జనసేన ప్రోగ్రాం కమిటీ సభ్యుడిగా "రాజేంద్ర"
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగంను ఈ నెల 8వ తేదీన 31 మంది సభ్యులతో ప్రకటించారు. ఇందులో రంపచోడవరం నియోజకవర్గం నుండి అడ్డతీగల కు చెందిన తాటికొండ రాజేంద్ర కు స్థానం కల్పించారు. రాజేంద్ర నియామకం పట్ల స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ శనివారం రాజేంద్ర స్వగృహానికి వచ్చి వారు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా రాజేంద్ర మాట్లాడుతూ.. జనసేన పార్టీని గ్రామస్థాయి లో బలోపేతం చేసినందుకు గానూ జిల్లాస్థాయిలో తనకు గుర్తింపు వచ్చిందని, జనసెన పార్టీ కి కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్త గుర్తుంటారని, తనకు ఈ అవకాశం రావడానికి కారణమైన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ కి, కార్యక్రమాల నిర్వహణ విభాగం రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ కళ్యాణం శివ శ్రీనివాస్ కి, నియోజకవర్గం జనసేన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్టీ తనకు ఇచ్చిన బాధ్యతను పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. రాజేంద్ర కి అభినందనలు తెలిపిన వారిలో రాజవొమ్మంగి మండల అధ్యక్షులు బొదిరెడ్డి త్రిమూర్తులు, మండల జనసేన నాయకులు సాయి, లోకేష్, గోపి, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్