పవనగిరి క్షేత్రంలోని శ్రీరామలయం నందు నేడు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మకు అష్టోత్తర పూజ , శ్రీ సుదర్శన హోమం విద్యార్థిని, విద్యార్థులతో ఉట్టి ఉత్సవం వంటివి పవనగిరి స్వామీజీ జరిపించారు. అనంతరం కృష్ణుడి వేషధారణ, రాధా , రుక్మిణీ వేశాధరణ లతో ఉట్టి కొట్టారు. తదుపరి మిగిలిన బాల బాలికలు ఉట్టి ఉత్సవం లో పాల్గొన్నారు. ఆశ్రమ పాఠశాల, ఎంపి యీపి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. వేషధారణ చేసిన బాలబాలికలకు బహుమతులు, ఆడపిల్లల అందరికీ గాజులు, పెన్నులు, పులిహార, చక్కెర పొంగలి ప్రసాద వితరణ జరిగింది.