హీరో, హీరోయిన్లు గా అల్లరి నరేష్, శ్రీదేవీ సోడా సెంటర్ ఫ్రేమ్ అనంది కాంబినేషన్ లో రూపొందుతున్న నూతన చిత్రం సన్నివేశాలను అడ్డతీగల ఏజెన్సీ ప్రాంతం లో చిత్రీకరణ ఆదివారం (నేడు) చిత్రీకరణ చేశారు. స్థానిక వేటమామిడి గ్రామంలోని విద్యుత్ ప్లాంట్ పక్కన గల ఏలేరు నది ఒడ్డున చిత్రీకరించారు. గాయపడిన వ్యక్తిని మంచం మీద మోసుకెళ్తు తీసుకెళ్లే సమయంలో ఏరు దాటడానికి హీరో అల్లరి నరేష్ చేసిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
అల్లరి నరేష్ ఈ చిత్రంలో కొత్తగా పాత్రలో కనపడనున్ననారు. సోమవారంతో చిత్రీకరణ ఈ ప్రాంతంలో పూర్తవుతుందని ఈ చిత్ర సభ్యులు తెలిపారు. సరిలేరు నీకెవ్వరు ఫేం కుమనన్ సేతురాం, కమిడియన్ ప్రవీణ్, సంపత్ తదితరులు ఈ చిత్రీకరణ లో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో చుట్టూ ప్రక్కల ప్రజలు భారీగా పాల్గొని చిత్ర సన్నివేశాలను చూసి ఆనందించి, తమ అభిమాన నటులతో సెల్ఫీలు దిగారు.