అల్లూరి జిల్లాలోని రంపచోడవరం డివిజన్ పరిధిలోని అడ్డతీగలలో గల సెయింట్ మెరిస్ పాఠశాల లో 2 దశాబ్దాలు వేడుకను శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం ఈ ఓ మల్లేశ్వరరావు, సి ఐ రాంబాబు, ఎస్సై అప్పలరాజు, డాక్టర్ భాస్కర్ ముఖ్య అతిధులుగా, ఉప సర్పంచ్ శ్రీను, లాయర్ రమణ విశిష్ట అతిధులుగా పాల్గొన్నారు. ప్రధమంగా వందేమాతరంతో మొదలయిన కార్యక్రమం గత కోవిద్ కాలంలో ప్రజలకు సేవలందించిన నర్సులను, పోలీసులకు, వాలంటీర్ల ను అతిధులచే, పాఠశాల సిబ్బంది చే ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా అతిథులు 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్న పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, కోవిడ్ వారియర్స్ సేవలను గుర్తుచేశారు. అనంతరం స్కిట్స్, డాన్సులు, పిల్లల స్పీచ్ లు, మ్యాజిక్ షో, ఫెషన్ షో వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చివరిగా పాఠశాల ప్రిన్సిపాల్ మినిమొల్ మాట్లాడుతూ.. కోవిడ్ వారియర్స్ సన్మాన విశిష్ఠతను తెలియజేసి, 2 దశాబ్దాల కాలంలో తమ పాఠశాల ఎన్నో విజయాలు సాధించినదని, ప్రతి ఏటా తమ విద్యార్థులు నవొదయలో 2 నుండి 4 సీట్లు సాధించడం, రెండేళ్ల క్రితం తమ విద్యార్థి రాష్ట్ర వ్యాప్త నాట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించి, వైజాగ్ లో అవార్డు అందుకోవడం, తమ పాఠశాలలో విద్యను పూర్తి చేసుకుని తదుపరి పాఠశాలలో తమ విద్యార్థులు ముందున్నారని వారి తల్లిదండ్రులు తమకు చెప్పడం గర్వ కారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, పాత్రికేయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.