చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సోమవారం ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అడ్డతీగల మండల కేంద్రంలో అత్యవసర షాపులు మినహా మిగతా అన్ని షాపుల వారు స్వచ్ఛందంగా తమ షాపులను మూసేశారు. పలు ప్రైవేట్ విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. ప్రస్తుతం 144 సెక్షన్ రాష్ట్రంలో అమలులో ఉన్న కారణంగా పోలీసు వారు సీతపల్లి జంక్షన్ వద్ద కాపలా కాస్తున్నారు. మండలంలోని పలువురి టిడిపి నేతలను పోలీసు వారు హౌస్ అరెస్ట్ చేశారు.