నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల ఛైర్మన్లు, ఉప ఛైర్మన్లు రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. ఆదివారం మలికిపురంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నికైన పీసీ ఛైర్మన్, డీసీ ఛైర్మన్, నీటి సంఘాల ఛైర్మన్, ఉప ఛైర్మన్లను ఎమ్మెల్యే సాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.