ప్రజా సమస్యలపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సత్వరమే స్పందించి వాటికి పరిష్కారం చూపాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. మలికిపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆయన పాల్గొని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజల వద్ద నుంచి సమస్యలపై 41 అర్జీలను స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.