రాజోలు నియోజకవర్గం రాజకీయాలలో ఆదివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మలికిపురం మండల కేంద్రం మలికిపురంలో జనసేన పార్టీలకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రత్యక్షమయ్యారు. మలికిపురంలో జీతాల కోసం నిరసన తెలుపుతున్న అధ్యాపకులకు మద్దతుగా ఎమ్మెల్యే దేవను రాపాక కలిసినట్లుగా ఆయన సన్నిహితులు చెప్పారు.