ప్రజలందరూ సుఖ సంతోషాలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ సూచించారు. ఆయన సఖినేటిపల్లి మండలంలోని మోరిపోడు గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ దైవజనులు ఈ క్రిస్మస్ వేడుకలలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు.