రాజోలు మండలం కూనవరం గ్రామంలో శనివారం సాయంత్రం చూపరులకు కనువిందు కలిగించింది. దట్టంగా అలుముకున్న మేఘాల నడుమ సప్త వర్ణాలతో కూడిన ఇంద్రధనస్సు. ఈ హరివిల్లును ఎంతోమంది చూసి ఆహ్లాదం పొందారు. దసరా సందడి నడుమ ఇంద్రధనస్సును చూసి ప్రజలు మురిసిపోయారు. ఈ అద్భుతమైన, అరుదైన దృశ్యాన్ని సెల్ ఫోన్ లలో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.