రాజోలు మండల కేంద్రం రాజోలులోని ప్రధాన తాగునీటి పైప్ లైనుకు లీకేజ్ ఏర్పడింది. దీంతో తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగింది. లీకేజ్ ఏర్పడిన ప్రాంతంలో పైపులైనుకు గురువారం మరమ్మతులు చేపట్టారు. పంచాయతీ సర్పంచ్ రేపు జ్యోతి, కార్యదర్శి రెహమాన్ ఆధ్వర్యంలో ఈ పనులు నిర్వహిస్తున్నారు. లీకేజీని అరికట్టి తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని వారు తెలిపారు.