సఖినేటిపల్లి మండలం సఖినేటిపాలెంకు చెందిన నేతల విద్యాసాగర్ (41) అబుదాబిలో ఈ నెల 21వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడని అతని కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు. కొన్నాళ్ల క్రితం విద్యాసాగర్ ఉపాధి కోసం అబుదాబి వెళ్లాడన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి పని చేసే కంపెనీ యజమానులు తమకు మరణవార్త తెలిపారన్నారు.