కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామంలో బాబావారు సమాధి చెంది 106 యేళ్లు పూర్తయిన సందర్భంలో బాబా వారి నవరాత్రులు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక లక్ష్మీదేవి కోనేరులో సాయి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం కలశాలతో ప్రత్యేక ఆధ్యాత్మిక కలశర్యాలీ నిర్వహించారు. అనంతరం బాబా వారి ఆలయంలో కలశస్థాపన చేసి నవరాత్రులు ప్రారంభించినట్లుగా తెలిపారు.