సీఎం రిలీఫ్ ఫండ్ కు యనమల ఫౌండేషన్ తరపున లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని తుని ఎమ్మెల్యే యనమల దివ్య సీఎంకు అందించారు. బుధవారం కాకినాడ జిల్లాలో ఏలేరు ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా ఆయనను ఎమ్మెల్యే కలిసి విజయవాడ వరద బాధితులకు తుని నియోజవర్గంలో దాతలు ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు చంద్రబాబుకు అందజేశారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, యనమల రాజేష్ పాల్గొన్నారు.