మొక్కలను తల్లితో సమానంగా చూసుకోవాలి
పర్యావరణ పరిరక్షణ కోసం మనం నాటే మొక్కలను తల్లితో సమానంగా చూసుకోవాలని పలువురు సర్పంచులు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడ, గుమ్మిలేరు గ్రామాలలో గురువారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామ సచివాలయాల ఆవరణము నందు సర్పంచులు కట్టా శ్రీనివాస్, గుణ్ణం రాంబాబులు స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి మొక్కలు నాటారు.