జొన్నాడ పుష్కర ఘాట్ కి పూర్వ వైభవం

52చూసినవారు
జొన్నాడ పుష్కర ఘాట్ కి పూర్వ వైభవం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో గౌతమి గోదావరి నది చెంతన ఉన్న పుష్కర ఘాట్ కు పూర్వ వైభవం లభించిందని పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు అన్నారు. గ్రామ టిడిపి నాయకులు తాడి శ్రీనివాసరెడ్డి( బట్టి శ్రీను) ఆధ్వర్యంలో సోమవారం పుష్కర ఘాట్ ను శుభ్రపరిచే పనులను ప్రారంభించారు. గోదావరి వరదలు కారణంగా పేరుకుపోయిన మట్టి వ్యర్ధాలను భారీ యంత్రాలతో తొలగించారు.

సంబంధిత పోస్ట్