డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు నూతన ఎస్సైగా ఎం. అశోక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎస్ఐగా ఎల్. శ్రీను నాయక్ పనిచేశారు. కొత్తపేట ఎస్ఐగా పనిచేస్తున్న అశోక్ బదిలీపై ఆలమూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల సూచనలు, సలహాలతో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని, శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.