సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గొల్లప్రోలు మండల పరిధిలోని తాటిపర్తి గ్రామంలో గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం దొంగతనాలు, సైబర్ నేరాలు, మోటార్ సైకిల్ దొంగతనాల పై గ్రామ ప్రజలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు సామరస్యంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారితో జాగ్రత్తతో ఉంటూ వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పోలీసువారికి తెలియజేయాలని సూచించారు.