పెళ్లై రెండేళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో ఓ 23 ఏళ్ల వివాహిత వింత నాటకం ఆడింది. ఆమె గర్భం దాల్చినట్లు తన భర్త, ఇతర కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే తాజాగా తనకు పురిటినొప్పులు వస్తున్నాయంటూ సదరు మహిళ బుధవారం జనగామ ఎంసీహెచ్ ఆసుపత్రిలో చేరింది. కాసేపటికే ఆమె బాత్రూమ్ కి వెళ్లి గట్టిగా కేకలు వేసింది. బయటకు వచ్చి తనకు రక్తస్రావమైందని, పిండం పడిపోయిందని చెప్పింది. వైద్యులు ఆమెకు పరీక్షలు చేస్తే అసలు గర్భం దాల్చలేదనే నిజం బయటపడింది.