Feb 10, 2025, 03:02 IST/వనపర్తి
వనపర్తి
వనపర్తి: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాయి
Feb 10, 2025, 03:02 IST
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాలన్నీ నిర్వీర్యమయ్యాయని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో పలు గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్నారు. గ్రామాల అభివృద్దే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి తీరుతామని తెలిపారు.