ఏలేరు వరద నీటి ప్రవాహంలో గల్లంతై ఓ వ్యక్తి మృతి చెందాడు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన గొంతిన సుబ్బారావు (35) మంగళవారం రాత్రి వరద బాధితులకు భోజనం పంపిణీకి వెళ్లాడు. తిరిగి వస్తుండగా వరద నీటిలో గల్లంతయ్యాడు. రాత్రి నుంచి వెతకగా బుధవారం ముంపు కాలనీలో ఓ చోట సుబ్బారావు మృతదేహం తేలియాడింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.