వనపర్తి జిల్లా పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, డైరెక్టర్ల పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంగళవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పెబ్బేరులో ఎమ్మెల్యే మేఘారెడ్డికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు డప్పు వాయిద్యాలతో, బాణాసంచా కాలుస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.