Nov 18, 2024, 15:11 IST/
ఇకపై ఉమ్మడి పనిచేయనున్న హైడ్రా!
Nov 18, 2024, 15:11 IST
హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు హైడ్రా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. చెరువులు ఆక్రమణ, కాలుష్యానికి గురికాకుండా హైడ్రా చర్యలు ముమ్మరం చేసింది. వాటిని పరిరక్షిస్తూ పర్యావరణ హితంగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా హైడ్రా ముందడుగు వేసింది. ఈ మేరకు సోమవారం రోజున పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో పీసీబీ సెక్రటరీ రవితో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశం అయ్యారు.