మామిడికుదురు: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
మామిడికుదురు మండలం నగరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అమలాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 33కేవీ లైన్ ట్రీ కటింగ్ కొరకు తాటిపాక సెంటర్, మొగలికుదురు, వేగివారిపాలెం, గెద్దాడ, కడలి గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోతుందన్నారు.