ట్రాక్టర్- బైక్ ఢీ.. ఇద్దరికి గాయాలు

83చూసినవారు
ట్రాక్టర్- బైక్ ఢీ.. ఇద్దరికి గాయాలు
మామిడికుదురు మండలం బి. దొడ్డవరం రంగా విగ్రహం వద్ద బుధవారం బైకును ట్రాక్టర్ ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. పెదపట్నంలంకకు చెందిన కటికిరెడ్డి ప్రసాద్, కుమారుడు సాయిని తీసుకొని బైక్ పై అప్పనపల్లి వెళ్తుండగా, అప్పనపల్లి నుంచి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరి బైకుతో పాటు పక్కనే ఉన్న ఇంటి ప్రహరీని ఢీ కొట్టింది. బైక్ దెబ్బతిని ట్రాక్టర్ చక్రాలు విరిగి పడ్డాయి. ప్రమాదంలో ప్రసాద్, సాయి గాయపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్