Sep 23, 2024, 09:09 IST/
విడాకుల తర్వాత మొదటిసారి కొడుకును కలిసిన పాండ్యా.. వీడియో వైరల్
Sep 23, 2024, 09:09 IST
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవి విడాకులు తీసుకున్నాక వారి కుమారుడు అగస్త్య తన తల్లితో కలిసి విదేశాలలో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్న చాలా కాలం తర్వాత ఇప్పుడు అగస్త్యను కలిశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో హార్దిక్ పాండ్యా తన కొడుకు అగస్త్యను ఎత్తుకొని అతను కూడా ఓ చిన్న పిల్లాడిలా మారిపోయాడు.