వనపర్తి నియోజకవర్గంలోని పలు సమస్యలను గురువారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అసెంబ్లీలో లేవనెత్తారు. గత ప్రభుత్వం జిల్లాలో బైపాస్ రోడ్డు వేయుటకు పార్మేషన్ రోడ్డు వేశారని, మళ్ళీ రోడ్డు వేయుటకు సర్వే చేయడానికి వెళ్తే ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారని అటవీశాఖ మంత్రికి, స్వీకర్ దృష్టికి తెచ్చారు. ఖాన్ చెరువు కాలువతీయడానికి ఆరు కిలోమీటర్ల అటవీ భూమి ఉన్నందున ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు.