ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మసీదుల ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. 2024 ఏప్రిల్ నుంచి ఇది అమలులో ఉందని, దీని కోసం ఏటా రూ.90 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు.