విద్యుత్ షాక్.. తాత్కాలిక ఉద్యోగి మృతి
ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోలేట్ ప్రాంతంలో విద్యుత్ షాక్ కు గురై విద్యుత్ శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న మోర్త సాయిరాం (42) మంగళవారం మృతిచెందాడు. 33 కేవీ వైర్ల మరమ్మతులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్ కు గురై పైనుంచి పడిపోయాడు. ముమ్మిడివరంలో ఒక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.