తెలుగుదేశం విజయాన్ని ఎవరూ ఆపలేరు
రాష్ట్రంలో కూటమి పార్టీల విజయం ఖాయమని ఈ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట మండలం వేట్లపాలెం లో గురువారం రాత్రి వరకూ భారీగా బైక్ ర్యాలీ పెద్దఎత్తున నిర్వహించారు. ఎమ్మెల్యే చినరాజప్ప, ఎంపీ అభ్యర్థి తంగేళ్ల. ఉదయ్ శ్రీనివాస్, గుణ్ణం చంద్రమౌళి లుర్యాలీ అగ్రభాగాన వాహనం పై నిలుచుని రోడ్డు కిరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేశారు.