పెద్దాపురం: పశు రైతులు అప్రమత్తంగా ఉండాలి
గ్రామీణ ప్రాంతాలలో రైతులు తమ పశువుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తుమ్మల రామస్వామి అన్నారు. సోమవారం పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో జరిగిన ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో పశు వైద్యాధికారులు డాక్టర్ గంగాభవాని (కాండ్రకోట) డాక్టర్ మస్తాన్ బి (దివిలి), పశు వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.