సామర్లకోట: భూముల రీ సర్వే రైతులకు మేలు

69చూసినవారు
భూముల నమోదులలో లోపాలు ఉన్న రైతులు ప్రభుత్వం నిర్దేశించిన రీసర్వే గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని.. సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్ర శేఖర రెడ్డి పేర్కొన్నారు. శనివారం సామర్లకోట మండలం మాధవపట్నం పంచాయతీ ఆవరణలో నిర్వహించిన రీసర్వేగ్రామ సభలకు తహసీల్దార్ చంద్రశేఖరరెడ్డి హాజరైయి సమగ్రంగా వివరించారు. ఈ సభలలో డిప్యూటీ తహసీల్దార్ వై.శ్రీనివాస్, తదితర వీఆర్వోలు,మండల సర్వేయర్,గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్