సచివాలయాలలో సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, సమయ పాలన పాటించకున్నా సిబ్బందిపై చర్యలు తప్పవని సామర్లకోట మున్సిపల్ కమీషనర్ శ్రీవిద్య మంగళవారం హెచ్చరించారు. సచివాలయాల ఆకస్మిక తనిఖీలలో భాగంగా 13వ సచివాలయాన్ని తనిఖీ చేసారు. ఆ సమయంలో కేవలం ఒక్కరు మాత్ర అందుబాటులో ఉండగా మిగిలిన వారికి ఫోన్లు చేసి తన ఎదుట హాజరుకావాలన్నారు. అనంతరం చేరుకున్న సిబ్బంది పని తీరును సమీక్షించారు.