Sep 13, 2024, 12:09 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
బాంబు స్క్వాడ్ బృందాల తనిఖీలు
Sep 13, 2024, 12:09 IST
ఉట్కూర్ మండల కేంద్రంలో శుక్రవారం బాంబు స్క్వాడ్, జాగిలాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వినాయక మండపాల, ప్రదన కుడళ్లు, ఆలయాలు, ప్రార్థన మందిరాలలో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.