Sep 08, 2024, 15:09 IST/వనపర్తి
వనపర్తి
జారాలకు పోటెత్తిన వరద... 15 గేట్లు ఓపెన్
Sep 08, 2024, 15:09 IST
వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం మళ్లీ పోటెత్తింది. అప్రమత్తమైన అధికారులు ఆదివారం ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తారు. డ్యాంకు 1, 57, 000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా. 1, 31, 676 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 317, 840 మీటర్లు నీరు నిల్వ ఉంది. దీంతో కృష్ణనది మరోసారి ఉగ్రరూపంతో శ్రీశైలానికి వెళ్తుంది. నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.