ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి సోమవారం మరికల్, ధన్వాడ మండలాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మండల కేంద్రాల్లో వివిధ యువజన సంఘాలు, కుల సంఘాలు, కాలనీల్లో, ఆలయాల వద్ద ప్రతిష్టాపన చేసిన వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తారు. అంతకు ముందు నారాయణపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.