మెదడుపై ప్రభావం చూపే.. కొత్త వైరస్‌

71చూసినవారు
మెదడుపై ప్రభావం చూపే.. కొత్త వైరస్‌
చైనాలో కొత్త రకం వైరస్‌ కలవరపెడుతోంది. జంతువుల్లో రక్తం పీల్చే పురుగుల నుంచి మనుషులకు వ్యాపించే వెట్‌ల్యాండ్‌ వైరస్‌ (WELV)ను పరిశోధకులు గుర్తించారు. ఇది కొన్నిసార్లు నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నట్లు కనుగొన్నారు. జిన్‌జువో నగరంలో 61ఏళ్ల వృద్ధుడిలో 2019లోనే మొదటగా ఈ వైరస్‌ను గుర్తించారు. మంగోలియాలో ఉన్న ఇతడికి పరాన్నజీవి కుట్టడంతో అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే పరిశోధకులు సమీప ప్రాంతాల్లో దాదాపు 14,600 జీవులను సేకరించి అధ్యయనం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్