మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను వెలుగులోకి తెచ్చిన జస్టిస్ హేమ కమిటీ తరహాలో కోలీవుడ్‌లో కూడా ఓ కమిషన్ ఏర్పాటైంది. ఈ విషయాన్ని నటుడు, నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ ఆదివారం తెలిపారు. ఎవరిపైనైనా ఫిర్యాదు వస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ కమిషన్‌లో న్యాయవాదులు కూడా ఉంటారని నటుడు, నడిగర్ సంఘం ప్రెసిడెంట్ నాజర్ వెల్లడించారు.