వచ్చే వారం రష్యాలో పర్యటించనున్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్: రిపోర్ట్

67చూసినవారు
వచ్చే వారం రష్యాలో పర్యటించనున్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్: రిపోర్ట్
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వచ్చే వారం బ్రిక్స్ NSA సదస్సు కోసం రష్యాలో పర్యటించనున్నారని పలు వార్తా కథనాలు తెలిపాయి. ఈ సదస్సు ఎజెండాలో ఉక్రెయిన్ యుద్ధం అగ్రస్థానంలో ఉందని సమాచారం. చైనా జాతీయ భద్రతా సలహాదారు వాంగ్ యీ కూడా వచ్చే వారం రష్యాకు వెళ్తారని సమాచారం. కాగా, ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తులుగా వ్యవహరించొచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల అన్నారు.

సంబంధిత పోస్ట్