Sep 15, 2024, 08:09 IST/
ట్యాంక్ బండ్ పై గణేశ్ నిమజ్జనానికి అనుమతివ్వకుంటే మండపాల్లోనే గుడి కడతాం: గణేశ్ ఉత్సవ సమితి
Sep 15, 2024, 08:09 IST
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వకుంటే నగర వ్యాప్తంగా సోమవారం ఆందోళనలు చేపడతామని, విగ్రహాలను మండపాల్లోనే పెట్టి గుడి కడతామని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొత్త నిబంధనలు తీసుకొచ్చి ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని సమితి నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు ట్యాంక్ బండ్ పై గణేశ్ నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బారికేడ్లను వారు తొలగించారు.